హైదరాబాద్, వెలుగు: వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి కీలక స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది కూడా గతంలో అనుసరించిన పరీక్షా విధానాన్నే కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఆన్సర్ బుక్ లెట్‌తో పాటే ఓఎంఆర్ షీట్ జత చేసి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. విద్యార్థులు ఓఎంఆర్ షీట్ నింపే విధానంపై ముందుగానే అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఓఎంఆర్ షీట్, ఆన్సర్ బుక్‌లెట్ శాంపిల్ కాపీలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.
